Posts

కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes

Image
  బ్రౌనీస్ ఎన్నో రకాలున్నాయ్, ఇది సింపుల్ బేసిక్ చాక్లెట్ బ్రౌనీ. బ్రౌనీ పైనా పక్కలు క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా మాయిస్ట్గా అచ్చం కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీలా వస్తుంది. నిజానికి బ్రౌనీస్ టెక్నిక్ తెలిస్తే చేయడం చాలా తేలిక, కానీ కచ్చితమైన కొలతలుండాలి, సరైన టెంపరేచర్ మీద బేక్ చేయాలి. ఇందులో ఏది సరిగా జరగకపోయినా బ్రౌనీ సరిగా రాదు. నేను చాలా సార్లు బ్రౌనీ చేసి ఫెయిల్ అయ్యాను, నిజం చెప్పాలంటే అసలు ఒరిజినల్ బ్రౌనీ రుచి రూపం రెండూ రాలేదు. ఆ తరువాత హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్ బుఫేకి వెళ్ళినప్పుడు అక్కడ బేకర్ని నా బ్రౌనీస్లో సమస్య ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. చెఫ్ సుశాంతా టిప్స్తో పర్ఫెక్ట్ బ్రౌనీస్ చేయడం నేర్చుకున్నా. నేను ఈ బ్రౌనీస్ ఎగ్తో చేస్తున్నాను త్వరలో ఎగ్లెస్ పోస్ట్ చేస్తా టిప్స్ ఈ బ్రౌనీకి నేను 9 x 9 ఇంచెస్ మౌల్డ్ వాడాను కఫే స్టైల్లో ఇంచ్ సైజ్ ఉండే బ్రౌనీస్ కోసం 12 x 12 ఇంచ్ మౌల్డ్ వాడుకోండి. బ్రౌనీ మిక్స్ చేసే ముందే సామానంత రెడీ చేసుకుని. ఓవెన్ ప్రీ- హీటింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత మిక్సింగ్ మొదలెడితే ప్రీ- హీటింగ్ పూర్తయ్యే సమయానికి మిక్సింగ్ కూడా పూర్తవుతుంది.

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

Image
  10 నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ స్వీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రా స్పెషల్ పాకం పూరీలు 100% పర్ఫెక్ట్ స్వీట్. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ process పాకం పూరీలు ఇవి ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం...ఇవి చేయడం ఎంతో సులభం. ఇవి కనీసం 10 రోజుల పైన నిలవుంటాయ్. మా యింట్లో స్వీట్ తినాలనిపించినా, లేదా పూరీలు చేసే రోజు మరి కొంచెం పిండి ఎక్కువ కలిపి కూడా ఇవి చేస్తుంటాం. పూరీలు మిగిలినిపోయినా మరో పద్ధతిలో ఇవి చేస్తుంటాం. ఇంకా మా ఇంట్లో పాలు దగ్గరగా కాచి ఈ పాకం పూరీలు వేసి కూడా తింటుంటాం. ఎటొచ్చీ మొత్తానికి చాల ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూనే ఉంటాం. ఇవి చాలా బాగుంటాయ్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్. ఇవి దాదాపుగా ఆంధ్రా అంతటా చేస్తున్నా, గోదావరి జిలాల్లో చాలా ఎక్కువగా చేయడం నేను చూసాను. ఇవి మామూలు పూరిలా లాగే చేస్తారు కాని చిన్న మర్పులున్నాయ్ అంతే. టిప్స్ • మైదా కి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు • పూరిలని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్, అల కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవచ్చు. అవీ కూడా బాగుంటాయ్ • ఈ పూరిలను ఇదే కొలతలతో బెల్లం పాకం తో కూడా చేసుకోవచ్చు, అవీ చాలా బాగుంటాయ్ • పాకం తీగపాకం వస్త

గోంగూర పనీర్

Image
  “గోంగూర పనీర్” పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రమాత గోంగూరతో మనం పచ్చళ్లు, పులుసులు, అన్నాలు, పులావ్లు ఇలా ఎన్నో చేస్తుంటాము. గోంగూరతో చేసే వంటకాలు మనతో పాటు పక్క రాష్ట్రాల వాళ్ళూ ఎంతో ఇష్టంగా తింటారు. నా పంజాబీ ఫ్రెండ్ మా ఇంటికి డిన్నర్కి వచ్చినప్పుడు మేము చేసే గోంగూర పచ్చడి తెగ నచ్చేసింది. తాను గోంగూరతో పాలక పనీర్ కి మల్లె గోంగూర పనీర్ చేయవచ్చు కదా మీ స్పైసెస్ తో వేసి అన్నాడు, అవును నిజమే కాదా అనిపించి మన కారాలు తగ్గించకుండా డిజైన్ చేసి తనకి పంపించాను. చాలా ఎంజాయ్ చేశాడు . ఆ తరువాత ఈ రెసిపి విస్మయ్ ఫుడ్ స్పెషల్ రెసిపి అయిపోయింద టిప్స్ ఈ కూరకి నూనె కాస్త ఎక్కువగా ఉండాలి అప్పుడే రుచి. గోంగూర వంకాయ ఇలాంటి కూరలకి నూనెలు ఉప్పు కారాలుండాలి. గోంగూర నూనె లో బాగా వేగితేనే జిగురు తగ్గుతుంది. ఎర్ర గోంగూర అయితే కాస్త పులుపు ఉంటుంది. పచ్చళ్లకి ముదురు గోంగూర వాడితే మంచిది. ఈ కూరకి లేత గోంగూర అయితే మెత్తగా గుజ్జుగా ఊడుకుతుంది. మార్కెట్ నుండి తెచ్చిన పనీర్ అయితే వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచి కూరలో వేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయి. 200 gms   పనీర్ లేత గోంగూర - ఓ పెద్ద కట్ట 3  చీలికలు

ఇన్స్టంట్ కుల్ఫీ 5 నిమిషాల్లో | బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ

Image
  5 నిమిషాల్లో మూడే స్టెప్పుల్లో బెస్ట్ కుల్ఫీ!!! నోట్లో వెన్నలా కరిగిపోతుంది ఈ ఈసీ ఇన్స్టంట్ కుల్ఫీ. బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ స్టెప్ బై స్టెప్  process.  ఇన్స్టంట్ కుల్ఫీ 5 నిమిషాల్లో | బెస్ట్ ఇన్స్టంట్ కేసర్ కుల్ఫీ ఈ పద్ధతి ఫాలో అయితే మామూలు కుల్ఫీకి మల్లె గంటల తరబడి పాలని మరగకాచి కుల్ఫీ తయారు చేయనవసరం లేదు. చాలా సులభంగా సీల్కీ స్మూత్ కుల్ఫీ వస్తుంది. ఈ కుల్ఫీ మిక్స్ తయారు చేయడానికి కేవలం 5 నిమిషాలు చాలు. బెస్ట్ కుల్ఫీని సులభంగా ఒరిజినల్ రుచి రూపం ఏ మాత్రం పాడవకుండా చేయవచ్చు అని ఒక బేకరీ చెఫ్ నాతో అన్నాడు, నాకు అర్ధం కాలేదు. తరువాత దాని సైన్స్ చెబితే త్రిల్ అయిపోయా, ఆ తరువాత తన రెసీపీనీ ఫాలో అయిపోయా. మీరు ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే నాలా తప్పక త్రిల్ అవుతారు మరి. టిప్స్ కుల్ఫీ మిక్స్ మెటల్ మౌల్డ్స్ లో పోసి ఫ్రిజ్లో ఉంచితే చాలా గట్టిగా ఫ్రీజ్ అవుతాయ్, ప్లాస్టిక్ మౌల్డ్స్ లో పోసి ఉంచిన దానికంటే కుల్ఫీ కనీసం 12 గంటలు లేదా రాత్రంతా ఉంచితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయ్ కుల్ఫీ సెట్ అయ్యాక పుల్ల గుచ్చి నీళ్ళలో ముంచి 5 సెకన్లు ఉంచితే చాలు లూస్ అయ్యి మౌల్డ్ ని వదులుతుంది. అప్పుడు గుచ్చిన పు

ఉడుపి హోటల్ స్టైల్ చపాతీ కూర్మ | ఉడుపి హోటల్ కూర్మ

Image
  చపాతీ పూరీ సెట్ దోశా ఇలా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే మసాలాలూ లేని కూర్మ కావాలంటే ఉడుపి హోటల్ స్టైల్ కూర్మ పర్ఫెక్ట్!!! అన్నీ అందరిళ్ళలో ఉండే పదార్ధాలతో తయారయ్యే పరమ సింపుల్ కుర్మా స్టెప్ బై స్టెప్. చపాతీ పూరీలలోకి ఎప్పుడూ మసాలా కూర్మనే కాదు అంతకంటే రుచికరమైన కుర్మా ప్రేత్యేకంగా ఉడుపి హోటేల్స్ లో ఇచ్చే మిక్స్ వెజ్ కూర్మ. ఈ కూర్మ లో అల్లం వెల్లులి ఉండదు, అయినా ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర్మ వండుతుంటే ఇల్లంతా సువాసనలే! ఉడుపి హోటల్ స్టైల్ కూర్మ కోసం కొన్ని టిప్స టిప్స్ కూరగాయలు నూనెలోనె పూర్తిగా మెత్తగా అయ్యేదాక వేపకూడదు, అలా వేపితే కుర్మా తయారయ్యేపాటికి గుజ్జుగా అవుతుంది మిరపకాయలు: ఈ కూర్మకి కచ్చితంగా బైడగీ మిరపకాయలు, లేదా కాశ్మీరీ మిరపకాయలు ఉండాలి అప్పడే కూర్మకి ఎర్రటి రంగు పరిమళం. మామూలు కారం గల మిరపకాయలు వాడితే కూరకి కారం వస్తుంది కానీ, పరిమళం ఎర్రటి రంగు రాదు. చింతపండు పులుసు: చింతపండు పులుసు కూర్మలో తెలిసి తెలియనట్లు ఉండాలి, పులుసుల మాదిరి ఎక్కువగా పోయాకూడదు బెల్లం: ఉడిపి హోటల్ స్టైల్ కూర్మ అంటేనే తెలిసి తెలియనట్లు తీపి ఉంటుంది. ఆ తీపి కూర్మ రుచిని పెంచుతుంది. అందుకే ఆ

సేమియా కర్డ్ బాత్

Image
  కొన్ని రెసిపీస్ చిటికెలో అయిపోవడమే కాదు, తిన్న ప్రతీ సారి కడుపుతోపాటు మనసు నిండిపోతుంది అంటారే. అలాంటి రేసిపీనే ఈ "సేమియా కర్డ్ బాత్". ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఎండలకాలం లో, డిన్నర్ గా ఈ రెసిపీ పర్ఫెక్ట్. చేయడం కూడా సులభం. ఒక రకంగా ఇది సెమియాతో చేసే దద్దోజనమే కానీ మనకు తెలిసిన దద్దోజనాన్ని సెమియాతో మార్చి ఆ పేరు పెట్టి కలుషితం చేయలేక ఇలా నామకరణం చేశా. దద్దోజనం లాగే కానీ చేసే తీరు వేసే పదార్ధాలు మారతాయ్. సెమియాని ఇలాగే ఉడికించాలి. • సెమియాని నీళ్ళు మరగుతున్నప్పుడు మాత్రమే వేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా నిమిషం మరిగించి వంపేస్తే 80 % ఉడికిపోతుంది. అలా మాత్రమే ఉడికించిన సెమియాలో వెంటనే చన్నీళ్ళు పోసేయాలి అప్పుడు సెమియా ముద్దగా అవ్వదు. పెరుగులో నానినా సెమియా ముద్దకట్టదు. • 80% అంటే సెమియాని నలిపితే ఇంకా పలుకుండాలి సెమియాలో. టిప్స్ కమ్మని “సెమియా కర్ద బాత్” కోసం కొన్ని టిప్స్: • పెరుగు కమ్మనిది తాజాది అయితే రుచిగా ఉంటుంది కర్ద బాత్ • కీర దోసకాయ గింజలు తీసేసి వేసుకుంటే తినేందుకు రుచిగా ఉంటుంది. కీర దోసకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయ్. నచ్చని వారు వదిలేవచ్చు. • నచ్చితే ఇంకా ఆరో

కొబ్బరి హల్వా | కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది

Image
  తీపి తినాలిపించినప్పుడు వెంటనే చేసుకోగలిగిన టేస్టీ సింపుల్ రెసిపీ ఈ కొబ్బరి హల్వా! ఈ టేస్టీ రెసిపీ స్టెప్ బై స్టెప్ కొబ్బరి హల్వా కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది బెల్లం వేసి చేసే ఈ హల్వా ఆరోగ్యం కూడా. కొబ్బరితో చేసే స్వీట్లు చాలానే ఉన్నాయి, పచ్చి కొబ్బరితో లడ్డూలు, లౌజులూ ఇంకా చాలానే చేస్తారు. ఈ సింపుల్ రెసిపి నేను చెన్నైలోని మాంబలం ప్రాంతం లో ఉండే ఒక అయ్యంగార్ కుంటుంబం నుండి తెలుసుకున్నాను. ఈ హల్వా వారు ధనుర్మాసంలో చేసి శ్రీ మహా విష్ణువుకి నివేదిస్తారు. నిజజనికి ఈ హల్వా నేను నెయ్యి వేసి కాల్చిన బ్రెడ్ మధ్యన్ జామ్లా స్ప్రేడ్ చేసి తింటాను. చాలా బాగుంటుంది ఒక సారి ట్రై చేసి చెప్పండి. ఈ హల్వాని జీడిపప్పు వేయకుండా ఇంకొంచెం ముద్దగా చేసి బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. ఈ సింపుల్ హల్వా ఎవ్వరైన చేసేంత సులభం, 4 పదార్ధాలతో అయిపోతుంది. కొలతలు కూడా చాలా సులభం. ఇంకా ఈ కొబ్బరి హల్వా 3-4 రోజులు పైనే నిలవ ఉంటుంది. కావాల్సిన పదార్ధాలు 2 cup   పచ్చి కొబ్బరి 1 cup   బెల్లం 3 - 4 spoon   నీళ్ళు 1/2 tsp   యాలకలపొడి 3 tbsp   నెయ్యి 10  జీడిపప్పు విధానం పచ్చికొబ్బరి తురుము, బెల్లం తరుగు కొద్దిగా నీ