పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

 10 నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ స్వీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రా స్పెషల్ పాకం పూరీలు 100% పర్ఫెక్ట్ స్వీట్. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ process


పాకం పూరీలు ఇవి ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం...ఇవి చేయడం ఎంతో సులభం. ఇవి కనీసం 10 రోజుల పైన నిలవుంటాయ్. మా యింట్లో స్వీట్ తినాలనిపించినా, లేదా పూరీలు చేసే రోజు మరి కొంచెం పిండి ఎక్కువ కలిపి కూడా ఇవి చేస్తుంటాం. పూరీలు మిగిలినిపోయినా మరో పద్ధతిలో ఇవి చేస్తుంటాం.

ఇంకా మా ఇంట్లో పాలు దగ్గరగా కాచి ఈ పాకం పూరీలు వేసి కూడా తింటుంటాం. ఎటొచ్చీ మొత్తానికి చాల ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూనే ఉంటాం. ఇవి చాలా బాగుంటాయ్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్. ఇవి దాదాపుగా ఆంధ్రా అంతటా చేస్తున్నా, గోదావరి జిలాల్లో చాలా ఎక్కువగా చేయడం నేను చూసాను.

ఇవి మామూలు పూరిలా లాగే చేస్తారు కాని చిన్న మర్పులున్నాయ్ అంతే.

టిప్స్

• మైదా కి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు

• పూరిలని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్, అల కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవచ్చు. అవీ కూడా బాగుంటాయ్

• ఈ పూరిలను ఇదే కొలతలతో బెల్లం పాకం తో కూడా చేసుకోవచ్చు, అవీ చాలా బాగుంటాయ్

• పాకం తీగపాకం వస్తే పూరీలు కనీస 10 రోజులు నిలవుంటాయ్

• ఇవి మిగిలినిపోయిన పూరిలతో చేసుకోదలిస్తే పాకం లో వేసి పూరిలను ఓ నిమిషం మరగనిచ్చి దిమ్పెసుకోండి, అప్పుడు పూరీలు పాకాన్ని పీలుస్తాయ్.


కావాల్సిన పదార్ధాలు

  • పూరిలకి
  • 250 gms మైదా/ గోధుమ పిండి
  • 1/4 spoon ఉప్పు
  • 3 tbsp నెయ్యి
  • పాకానికి
  • 500 gm పంచదార
  • 1 tsp యలకల పొడి
  • 150 ml నీళ్ళు

విధానం

  1. ముందుగా పిండి లో ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొండి. ఆ తరువాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మెత్తగా వత్తుకోండి
  2. బాగా వత్తుకున్నాక 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి పక్కనుంచుకోండి
  3. ఇప్పుడు పాకం కోసం పంచదార లో నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోండి, తరువాత యాలకల పొడి వేసి దింపేయండి
  1. నానుతున్న పిండిని నిమ్మకాయంత బాల్స్ గా చేసుకుని పల్చగా గుండ్రంగా వత్తుకోండి
  2. ఆ తరువాత పూరి పైన నెయ్యి రాసి మధ్యకి మడిచి, మళ్ళీ మధ్యకి మరో మడత వేసి మందంగా వత్తుకోండి
  3. ఈ పూరీ మందంగా లేదా పల్చగా ఎలా వత్తుకున్నా బాగుంటుంది, కాని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్. మందంగా వత్తుకుంటే పూరీలు పొంగి జ్యుసీ గా ఉంటాయ్
  4. వేడి వేడి నూనెలో వేసి పూరీలు పొంగనిచ్చి, వెంటనే వేడి పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసెయ్యండి
  5. వేడి వేడిగా జ్యుసీగా చాలా బాగుంటాయ్. చల్లారాక కూడా పూరిల పైన పంచదార పాకం ఏర్పడి అవీ రుచిగా ఉంటాయ్
  6. ఇవి డబ్బాలో దాచుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్

Comments

Popular posts from this blog

గోంగూర పనీర్

కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes