కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes

 బ్రౌనీస్ ఎన్నో రకాలున్నాయ్, ఇది సింపుల్ బేసిక్ చాక్లెట్ బ్రౌనీ. బ్రౌనీ పైనా పక్కలు క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా మాయిస్ట్గా అచ్చం కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీలా వస్తుంది.

నిజానికి బ్రౌనీస్ టెక్నిక్ తెలిస్తే చేయడం చాలా తేలిక, కానీ కచ్చితమైన కొలతలుండాలి, సరైన టెంపరేచర్ మీద బేక్ చేయాలి. ఇందులో ఏది సరిగా జరగకపోయినా బ్రౌనీ సరిగా రాదు.

నేను చాలా సార్లు బ్రౌనీ చేసి ఫెయిల్ అయ్యాను, నిజం చెప్పాలంటే అసలు ఒరిజినల్ బ్రౌనీ రుచి రూపం రెండూ రాలేదు. ఆ తరువాత హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్ బుఫేకి వెళ్ళినప్పుడు అక్కడ బేకర్ని నా బ్రౌనీస్లో సమస్య ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. చెఫ్ సుశాంతా టిప్స్తో పర్ఫెక్ట్ బ్రౌనీస్ చేయడం నేర్చుకున్నా.

నేను ఈ బ్రౌనీస్ ఎగ్తో చేస్తున్నాను త్వరలో ఎగ్లెస్ పోస్ట్ చేస్తా



టిప్స్

  1. ఈ బ్రౌనీకి నేను 9 x 9 ఇంచెస్ మౌల్డ్ వాడాను కఫే స్టైల్లో ఇంచ్ సైజ్ ఉండే బ్రౌనీస్ కోసం 12 x 12 ఇంచ్ మౌల్డ్ వాడుకోండి.

  2. బ్రౌనీ మిక్స్ చేసే ముందే సామానంత రెడీ చేసుకుని. ఓవెన్ ప్రీ- హీటింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత మిక్సింగ్ మొదలెడితే ప్రీ- హీటింగ్ పూర్తయ్యే సమయానికి మిక్సింగ్ కూడా పూర్తవుతుంది.

  3. ఓవెన్ ప్రీ- హీటింగ్ పూర్తయ్యాక వేడి తగ్గిపోతుంది, అందుకే ప్రీ-హీటింగ్ పూర్తవగానే బ్రౌనీ మౌల్డ్ ఉంచేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బ్రౌనీ వస్తుంది.

  4. ఒక్కో ఓవెన్ ఒక్కోలా పనిచేస్తుంది, కాబట్టి ఎప్పుడైనా బ్రౌనీ సెంటర్లో టూత్పిక్ గుచ్చి క్లీన్గా వచ్చేదాకా బేక్ చేయాలని గర్తుంచుకోండి.

  5. బ్రౌనీలో 2 tsp కాఫీ డికాషన్ వేస్తే చాక్లెట్ ఫ్లేవర్ మరింతగా తెలుస్తుంది. నేను వేయలేదు నచ్చితే మీరు వేసుకోవచ్చు.

  6. డార్క్ చాక్లెట్ని ఓవెన్లో అయితే 10 సెకన్లు హీట్ చేసి కలిపి మళ్ళీ 10 సెకన్లు హీట్ చేసుకోవాలీ మళ్ళీ కలిపి మళ్ళీ 10 సెకన్లు కలిపితే చాక్లెట్ పర్ఫెక్ట్గా మెల్ట అవుతుంది.

  7. చాక్లెట్ మౌల్డ్ ఎప్పుడూ స్టవ్ మీద డైరెక్ట్గా పెడితే చాక్లెట్ మాడిపోతుంది. అందుకే డబుల్ బ్రాయిలర్ మెథడ్ లేదా ఓవెన్లో మెల్ట చేయాలి.

  8. కావాల్సిన పదార్ధాలు

    • ఎగ్స్
    • 350 gm పంచదార (1 cup + ¾ cup)
    • 200 gm మైదా (1.1/2 cup + 1 tsp)
    • 30 gm కోకో పౌడర్ (¼ cup)
    • 1 tsp వెనీలా ఎసెన్స్
    • 125 gm డార్క్ చాక్లెట్
    • 250 gm బటర్

    విధానం

    1. చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చాక్లెట్ ముక్కలని ఒక బౌల్లో ఉంచి ఆ బౌల్ మరుగుతున్న నీళ్ళ పైన ఉంచి చాక్లెట్ని కరిగించండి. పూర్తిగా కరిగిన చాక్లెట్ని చల్లారనివ్వాలి
    2. బటర్లో చల్లారిన చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి.
    3. ఎగ్స్ లో పంచదార, వెనీలా ఎసెన్స్ వేసి ఎగ్స్ నూరగనూరగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి.
    4. ఎగ్స్ తెల్లని నూరగగా వచ్చాక చాక్లెట్ మిశ్రమం పోసి నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుకోవాలి
    5. జల్లెడలో మైదా, కోకో పౌడర్ వేసి జల్లించాలి. తరువాత కట్ & ఫోల్డ్ మెథడ్లో స్పాటులాతో అంతా కలిసేలా కలుపుకోవాలి.
    6. మౌల్డ్లో బటర్ పేపర్ ఉంచి దాని మీద చాక్లెట్ మిశ్రమం పోసి నెమ్మదిగా తడితే లోపల బుడగలు ఉంటే పోతాయ్
    7. ప్రీ-హీట్ చేసుకున్న ఓవెన్లో కేక్ మౌల్డ్ ఉంచి 170 డిగ్రీల దగ్గర 40 నిమిషాలు లేదా టూత్ పిక్ క్లీన్గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.
    8. బేక్ అయినా బ్రౌనీని మౌల్డ్ లోనే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన బ్రౌనీ అంచులని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి.
    9. బ్రౌనీ ఎప్పుడూ ఐస్క్రీం తో మరింత రుచిగా ఉంటుంది

Comments

Popular posts from this blog

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

గోంగూర పనీర్