సేమియా కర్డ్ బాత్

 కొన్ని రెసిపీస్ చిటికెలో అయిపోవడమే కాదు, తిన్న ప్రతీ సారి కడుపుతోపాటు మనసు నిండిపోతుంది అంటారే. అలాంటి రేసిపీనే ఈ "సేమియా కర్డ్ బాత్". ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఎండలకాలం లో, డిన్నర్ గా ఈ రెసిపీ పర్ఫెక్ట్. చేయడం కూడా సులభం.


ఒక రకంగా ఇది సెమియాతో చేసే దద్దోజనమే కానీ మనకు తెలిసిన దద్దోజనాన్ని సెమియాతో మార్చి ఆ పేరు పెట్టి కలుషితం చేయలేక ఇలా నామకరణం చేశా.

దద్దోజనం లాగే కానీ చేసే తీరు వేసే పదార్ధాలు మారతాయ్.

సెమియాని ఇలాగే ఉడికించాలి.

• సెమియాని నీళ్ళు మరగుతున్నప్పుడు మాత్రమే వేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా నిమిషం మరిగించి వంపేస్తే 80 % ఉడికిపోతుంది. అలా మాత్రమే ఉడికించిన సెమియాలో వెంటనే చన్నీళ్ళు పోసేయాలి అప్పుడు సెమియా ముద్దగా అవ్వదు. పెరుగులో నానినా సెమియా ముద్దకట్టదు.

• 80% అంటే సెమియాని నలిపితే ఇంకా పలుకుండాలి సెమియాలో.


టిప్స్

కమ్మని “సెమియా కర్ద బాత్” కోసం కొన్ని టిప్స్:

• పెరుగు కమ్మనిది తాజాది అయితే రుచిగా ఉంటుంది కర్ద బాత్

• కీర దోసకాయ గింజలు తీసేసి వేసుకుంటే తినేందుకు రుచిగా ఉంటుంది. కీర దోసకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయ్. నచ్చని వారు వదిలేవచ్చు.

• నచ్చితే ఇంకా ఆరోగ్యంగా రుచిగా తినాలనుకుంటే కీర దోసకాయ ముక్కలకి బదులు బూడిగా గుమ్మడి కాయ తురుము వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అసలు రుచిలో ఏ తేడా తెలియదు.

• దానిమ్మ గింజలు లేనట్లైతే ఎండు ద్రాక్ష తాలింపులో వేపి వేసుకోవచ్చు

• ఈ కర్ద బాత్ ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది

కర్డ్ బాత్ ముద్దగా అయిపోతే?

• కర్ద బాత్ ముద్దగా అయిపోతే కచ్చి చల్లార్చిన పాలు పోసుకుంటే సెట్ అయిపోతుంది

కావాల్సిన పదార్ధాలు

  • 120 gms సేమియా
  • 250 gms పెరుగు
  • సాల్ట్
  • ఓ కీర దోసకాయ తురుము
  • 1 tsp తాలింపులు (Mustard seeds, Cumin, Black Gram)
  • 1/2 tsp మిరియాల పొడి
  • 2 tbsps కొత్తిమీర తరుగు
  • కరివేపాకు ()
  • చిన్న అల్లం ముక్క
  • పచ్చిమిర్చి
  • 10 - 15 జీడిపప్పు
  • దానిమ్మ గింజలు (పిడికెడు)
  • 1 ltr నీళ్ళు
  • 2 tbsps నూనె

విధానం

  1. నీళ్ళు బాగా మసల కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియా వేసి జస్ట్ 30 సేకన్లు నుంచి ఓ నిమిషం పాటు ఉంచి వెంటనే వార్చేయండి
  2. వార్చిన సేమియా పైన చల్లటి నీళ్ళు పోసి పూర్తిగా చల్లారనివ్వండి
  3. తాలింపు కోసం నూనె వేడి చేసి, అందులో జీడిపప్పు వేసి వేపుకుని,తీసి పక్కనుంచుకోండి.
  4. అదే నూనె లో తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి వేపుకుని చల్లార్చుకొండి.
  5. కమ్మటి పెరుగుని బాగా చిలుక్కుని, కీర దోసకాయ తురుము వేసి, సాల్ట్ వేసి బాగా కలుపుకొండి.
  6. చల్లార్చుకున్న సేమియా, చల్లార్చుకున్న తాలింపు, మిరియాల పొడి, దానిమ్మ గింజలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోండి.
  7. ఇది చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది

Comments

Popular posts from this blog

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

గోంగూర పనీర్

కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes