Skip to main content

ఉడుపి హోటల్ స్టైల్ చపాతీ కూర్మ | ఉడుపి హోటల్ కూర్మ

 చపాతీ పూరీ సెట్ దోశా ఇలా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే మసాలాలూ లేని కూర్మ కావాలంటే ఉడుపి హోటల్ స్టైల్ కూర్మ పర్ఫెక్ట్!!! అన్నీ అందరిళ్ళలో ఉండే పదార్ధాలతో తయారయ్యే పరమ సింపుల్ కుర్మా స్టెప్ బై స్టెప్.


చపాతీ పూరీలలోకి ఎప్పుడూ మసాలా కూర్మనే కాదు అంతకంటే రుచికరమైన కుర్మా ప్రేత్యేకంగా ఉడుపి హోటేల్స్ లో ఇచ్చే మిక్స్ వెజ్ కూర్మ. ఈ కూర్మ లో అల్లం వెల్లులి ఉండదు, అయినా ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా ఉంటుంది.

ఈ కూర్మ వండుతుంటే ఇల్లంతా సువాసనలే! ఉడుపి హోటల్ స్టైల్ కూర్మ కోసం కొన్ని టిప్స


టిప్స్

  1. కూరగాయలు నూనెలోనె పూర్తిగా మెత్తగా అయ్యేదాక వేపకూడదు, అలా వేపితే కుర్మా తయారయ్యేపాటికి గుజ్జుగా అవుతుంది

మిరపకాయలు:

  1. ఈ కూర్మకి కచ్చితంగా బైడగీ మిరపకాయలు, లేదా కాశ్మీరీ మిరపకాయలు ఉండాలి అప్పడే కూర్మకి ఎర్రటి రంగు పరిమళం. మామూలు కారం గల మిరపకాయలు వాడితే కూరకి కారం వస్తుంది కానీ, పరిమళం ఎర్రటి రంగు రాదు.

చింతపండు పులుసు:

  1. చింతపండు పులుసు కూర్మలో తెలిసి తెలియనట్లు ఉండాలి, పులుసుల మాదిరి ఎక్కువగా పోయాకూడదు

బెల్లం:

ఉడిపి హోటల్ స్టైల్ కూర్మ అంటేనే తెలిసి తెలియనట్లు తీపి ఉంటుంది. ఆ తీపి కూర్మ రుచిని పెంచుతుంది. అందుకే ఆఖరున కొద్దిగా బెల్లం వేస్తారు


మసాలా పేస్ట్ కోసం

  • 3 tbsp నూనె
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1.5 inch దాల్చిన చెక్క
  • 1 tsp మిరియాలు
  • 1 tbsp పచ్చశెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 4 బైడగీ మిరపకాయలు
  • 4 కారం మిరపకాయలు
  • 1 cup పచ్చికొబ్బరి తురుము

కూర్మ కోసం

  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/2 cup కేరట్ ముక్కలు
  • 1/2 cup బటానీ
  • 1/2 cup బంగాళా దుంప ముక్కలు
  • 1/2 liter నీళ్ళు
  • 1/2 tsp పసుపు
  • 3 tbsp చింతపండు పులుసు
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1 tsp బెల్లం
  • 2 tbsp కొత్తిమీర తరుగు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో యాలక లవంగాలు మిరియాలతో పాటు మిగిలినవన్నీ వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి
  2. తరువాత వేపుకున్న వాటిని మిక్సీలో వేసుకోండి అలాగే తాజా కొబ్బరి తురుము కూడా వేసి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి
  3. పప్పులు వేపగా మిగిలిన నూనెలోనె ఉల్లిపాయ తరుగు, కేరట్ తరుగు, తాజా బటానీ, చెక్కు తీసిన దుంప ముక్కలు వేసి 3 నిమిషాలు వేపుకోవాలి
  4. వేగిన ముక్కల్లో అర లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 80% ఉడికించాలి. (80% అంటే ఆలూ ని ఫోర్క్తో గుచ్చితే మెత్తగా లోపలికి దిగాలి పైకి లేపితే ఫోర్క్ పై నిలిచి ఉండాలి)
  5. తరువాత ఈ కూర్మ చపాతీ, పూరీ, సెట్ దోశ, ఆపంలలోకి చాలా రుచిగా ఉంటుంది.వెన్నలా రుబ్బుకున్న మసాలా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి నూనె పైకి తేలేదాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి
  6. నూనె పైకి తేలాక కాస్త బెల్లం గడ్డ, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి
  7. ఈ కూర్మ చపాతీ, పూరీ, సెట్ దోశ, ఆపంలలోకి చాలా రుచిగా ఉంటుంది.


Comments

Popular posts from this blog

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

గోంగూర పనీర్

కఫే స్టైల్ చాక్లెట్ బ్రౌనీస్ రెసిపీ cakes